Share News

Kodandaram: వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

ABN , Publish Date - Jul 02 , 2025 | 08:28 AM

రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని టీజేఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. తెలంగాణ గవర్నమెంట్‌ విమెన్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ చైర్‌పర్సన్‌ ఉమాదేవి అధ్యక్షతన సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.

Kodandaram: వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

- ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్: రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని టీజేఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) అన్నారు. తెలంగాణ గవర్నమెంట్‌ విమెన్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ చైర్‌పర్సన్‌ ఉమాదేవి అధ్యక్షతన సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.


ఆయనతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, జాతీయ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ జయభారతి, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య, ఆలిండియా స్టేట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ సుధాకర్‌, వివిధ సంఘాల నాయకులు రాజేందర్‌బాబు, పుల్లయ్య, వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. పెన్షనర్లకు తన మద్దతు ఉంటుందని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తాను కూడా పెన్షనర్‌నేనని, ఇందులో భాగస్వామ్యం అవుతానని చెప్పారు.


తాను ఉపాధ్యాయుడిగా వీఆర్‌ఎస్‌ తీసుకున్నానని ఇప్పటి వరకూ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందలేదని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి(MLC Sripal Reddy) అన్నారు. ఒక్క నెల పెన్షన్‌ మాత్రమే అందుకున్నానని తెలిపారు. యూనియన్‌లు పోరాటం చేయాలని, ఒక పార్టీకి, ప్రభుత్వానికి అనుబంధంగా ఉండొద్దన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందేలా హెల్త్‌ కార్డులు ఇవ్వాలని,


city4.2.jpg

డీఏ ఇవ్వాలని, మహిళా పెన్షనర్స్‌ సంఘం నాయకులకు ఈహెచ్‌ఎస్‌ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని ఉమాదేవి డిమాండ్‌ చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పెన్షనర్ల జాతీయ, రాష్ట్ర సంఘాల నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు ధనలక్ష్మి, ఎస్‌.ఎం.ఎల్‌ నాగమాంబ, నాగమణిరెడ్డి, భాగ్యలక్ష్మి, లక్ష్మి, వరూధిని, సుగుణ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 08:28 AM