Marri Rajasekhar Reddy: పేదలు ఉంటున్న భూములను 118 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేయండి
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:46 AM
పేదలు నివాసముంటున్న దేవాదాయశాఖ భూమిని పేదలకే ఇచ్చి, దేవాదాయ శాఖకు ప్రభుత్వ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాజశేఖరరెడ్డి కోరారు.

సీఎంకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వినతి
మల్కాజిగిరి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి నియోజకవర్గంలో భూదాన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, దేవాదాయశాఖ తదితర భూముల్లో ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఆ భూములను జీవో 118 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్‌ను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు.
మల్కాజిగిరి పరిధిలోని సర్వేనంబర్ 278 లో సుమారు 22 కాలనీలకు చెందిన ప్రజలు దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని వివరించారు. పేదలు నివాసముంటున్న దేవాదాయశాఖ భూమిని పేదలకే ఇచ్చి, దేవాదాయ శాఖకు ప్రభుత్వ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాజశేఖరరెడ్డి కోరారు.