Share News

ఎవరా ఎస్‌ఈ? ఏమిటా ప్రాజెక్టు?

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:27 AM

ఈ నేపథ్యంలోనే సచివాలయంతో పాటు సంబంధిత శాఖలో ‘ఎవరా ఎస్‌ఈ, ఏమిటా సూపర్‌ గేమ్‌ చేంజర్‌ ప్రాజెక్టు’ అంటూ చర్చించుకుంటున్నారు.

ఎవరా ఎస్‌ఈ? ఏమిటా ప్రాజెక్టు?

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై చర్చ

ఓ కీలక శాఖలో పూర్తి అదనపు బాధ్యతల్లో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా పనిచేస్తున్న అధికారిని రిటైరయ్యాక కూడా కొనసాగించాలంటూ సంబంధిత శాఖ మంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సచివాలయంతో పాటు సంబంధిత అధికారి శాఖలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఏప్రిల్‌ 30న సదరు అధికారి పదవీ విరమణ పొందనున్నారని, సర్కారు సూపర్‌ గేమ్‌ చేంజర్‌గా భావిస్తున్న ప్రాజెక్టుకు ఆయన చాలా అవసరమని.. శాఖలోనే ఆయన్ను కొనసాగించాలంటూ మంత్రి రాసిన లేఖపై.. ‘ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచివాలయంతో పాటు సంబంధిత శాఖలో ‘ఎవరా ఎస్‌ఈ, ఏమిటా సూపర్‌ గేమ్‌ చేంజర్‌ ప్రాజెక్టు’ అంటూ చర్చించుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి

BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం

Cybercrime: సైబర్‌ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 03:27 AM