Ponnam Prabhakar: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:08 AM
రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు

దశలవారీగా పెండింగ్ సమస్యల పరిష్కారం: పొన్నం
హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అందుకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యానికి సహకారం అందిస్తుందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐదో వార్షిక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
90 ఏళ్లు నిండిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ మేలు కోసం రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం, సంస్థ పరిరక్షణ, ఈ మూడు అంశాలే ప్రాధాన్యాలుగా సంస్థ ముందుకు పోతోందని చెప్పారు. ఏడాది కాలంలో ఉద్యోగులు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే కొత్త బస్సుల కొనుగోలు చేపట్టినట్లు వివరించారు. కొత్త బస్సులకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సలహాలు, సూచనలతో సంస్థలో ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News