Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
ABN , Publish Date - Apr 18 , 2025 | 09:56 AM
Cool Drink Incident: సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు ముగ్గురు యువకులు. బాగా ఎండగా ఉండటంతో కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టారు. సర్వర్ కూల్ డ్రింక్ తెచ్చి ఇవ్వగా సరదా కబుర్లు చెప్పుకుంటూ ఆ యువకులు దాన్ని తాగారు. ఆ వెంటనే యాదుల్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

సంగారెడ్డి, ఏప్రిల్ 18: ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ... ఏది ముట్టుకున్నా నాసిరకమే. సరదాగా బయటకు వెళ్లి తినాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది తింటే అందులో నుంచి ఏది బయటపడుతుందో అని.. ఏ ఆహారంలో ఎలాంటి వస్తువులను చూడాల్సి వస్తుందో అనే భయం. ఆహారం విషయంలో వ్యాపారస్తులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా నాసిరకం పదార్థాలతో మమ అంటున్న పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నో సార్లు దాడులు చేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పుడు తాజా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ముగ్గురు యువకులు సరదాగా బయటకు వచ్చి హోటల్‌లో కూల్ డ్రింగ్ (Cool Drink) తాగారు. ఆ తరువాత అందులో ఒకరు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. ఇంతకీ కూల్‌డ్రింక్‌లో ఏం బయటపడిందో ఇప్పుడు చూద్దాం.
జిల్లాలోని సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు ముగ్గురు యువకులు. బాగా ఎండగా ఉండటంతో కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టారు. సర్వర్ కూల్ డ్రింక్ తెచ్చి ఇవ్వగా సరదా కబుర్లు చెప్పుకుంటూ ఆ యువకులు దాన్ని తాగారు. ఆ వెంటనే యాదుల్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కడుపులో నొప్పితో అల్లాడిపోయాడు. ఏం జరిగిందో తెలియక తోటి స్నేహితులు కంగారు పడిపోయారు. కూల్ డ్రింక్ తాగిన వెంటనే యాదుల్ అస్వస్థతకు గురవడంతో అనుమానం వచ్చిన ఇద్దరు యువకులు అతడు తాగిన కూల్ డ్రింక్ బాటిల్‌ను పరిశీలించారు. అందులో ఉన్న వాటిని చూసి ఇద్దరు యువకులు అవాక్కయ్యారు. ఇదేంటంటూ హోటల్ నిర్వాహకులను నిలదీశారు యువకులు.
Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..
యాదుల్ తాగిన కూల్ డ్రింక్ బాటిల్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా.. అందులో బల్లి కాలు ప్రత్యక్షమైంది. అంతేకాకుండా బల్లి అవశేషాలు కూడా అందులో కనిపించాయి. వాటిని చూసిన యువకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కూల్‌డ్రింక్‌లో బల్లి కాలు ఉండటాన్ని చూసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో బల్లి కాలు ఎలా వచ్చిందని, ఎందుకు ఇలాంటి వాటిని సరఫరా చేస్తున్నారని యువకులు ప్రశ్నించారు. అయినప్పటికీ హోటల్ నిర్వాహకులు మాత్రం పట్టించుకోలేదు. అంతేకాకుండా యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హోటల్ నిర్వాహకుడి తీరుపై యువకులు మండిపడ్డారు. చివరకు తీవ్ర అస్వస్థతకు గురైన బాధిత యువకుడిని సదాశివపేటలోని ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై యువకులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు యువకులు. అయితే కూల్‌డ్రింక్‌లో బల్లి కాలు వార్త జిల్లాలో సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
Gold Articles: వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించిన గుళ్లు.. ఎందుకంటే..
Hyderabad Student Suicide: బెట్టింగ్‌కు యువకుడి బలి
Read Latest Telangana News And Telugu News