Share News

BRS: కనకయ్య కుటుంబానికి హరీష్‌రావు ఆర్థిక సాయం

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:16 PM

BRS: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనకయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.

BRS: కనకయ్య కుటుంబానికి హరీష్‌రావు ఆర్థిక సాయం
BRS Leader Harish Rao

సిద్దిపేట జిల్లా: వర్గల్ మండలం, తున్కిమక్తలో ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Rajatotsava Sabha)కు వెళ్లి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో చనిపోయిన చాకలి కనకయ్య కుటుంబాన్ని (Kanakayya Family) బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి (Ex Minister Harish Rao) హరీష్‌రావు ఆదివారం పరామర్శించి రూ. 5 లక్షల (Rs. 5 lakhs) చెక్ ఆర్థిక సహాయం (Financial Assistance) అందచేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన కనకయ్య అనే వ్యక్తి దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని అన్నారు.


బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండ..

కనకయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా ఉంటామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశామని హరీష్ రావు తెలిపారు. ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఎంతో ఘనంగా జరిగిన రజతోత్సవ సభలో కనకయ్య మరణించిన ఘటన ఎంతో బాధ కలిగించిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: పండుగలా ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ


కాగా వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హుస్నాబాద్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వర్గల్‌ మండలానికి చెందిన చాకలి కనకయ్య (36) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు మృతుడికి భార్య సుజాత, పదేళ్లలోపు శాన్వికా, హన్వికా కుమార్తెలు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోంది..

శ్రీవారి ఆలయంపై మరోసారి వెళ్ళిన విమానం

For More AP News and Telugu News

Updated Date - Jun 01 , 2025 | 01:16 PM