Share News

Rahul Raj: కారడవిలో కాలి నడక

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:38 AM

కారడవిలో రెండు కి.మీ దూరం నడిచి వెళ్లారు. ఉపాధి హామీ కూలీ పనుల కొలతలు తీశారు. స్వయంగా తానే టేపుతో కూలీల ట్రంచ్‌ పనుల లెక్కలు తేల్చారు. తదుపరి స్కూల్‌లో పిల్లలకు లెక్కలు చెప్పి మాస్టారి అవతారం ఎత్తారు.

Rahul Raj: కారడవిలో కాలి నడక

  • 2 కి.మీ దూరం కాలిబాటలో ప్రయాణం

  • ఉపాధి కూలీల సమస్యలపై ఆరా

  • పర్వతాపూర్‌, కాట్రియాలలో మెదక్‌ కలెక్టర్‌ పర్యటన

రామాయంపేట, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కారడవిలో రెండు కి.మీ దూరం నడిచి వెళ్లారు. ఉపాధి హామీ కూలీ పనుల కొలతలు తీశారు. స్వయంగా తానే టేపుతో కూలీల ట్రంచ్‌ పనుల లెక్కలు తేల్చారు. తదుపరి స్కూల్‌లో పిల్లలకు లెక్కలు చెప్పి మాస్టారి అవతారం ఎత్తారు. ఆయనెవరో కాదు.. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌. రామాయంపేట మండలం పర్వతాపూర్‌ అడవిలో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను శనివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సుమారు 40 నిమిషాలు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి.. నేరుగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొలతలు సరిగ్గా వేస్తున్నారా..? మీ పనివేళలు ఏమిటి..? అని అడుగుతూనే ఎండలో ఎక్కువసేపు పనిచేసి వడదెబ్బ బారిన పడొద్దంటూ కూలీలకు జాగ్రత్తలు చెప్పారు.


కూలీల కుటుంబ వివరాలు, మౌలిక సదుపాయాలనూ తెలుసుకున్నారు. ఇది ఉపాధి పథకం ప్రారంభ సీజన్‌ కనుక అత్యధిక సంఖ్యలో కూలీలను పనుల్లో చేరేలా చూడాలని ఎంపీడీవో సాహలుద్దీన్‌ను ఆదేశించారు. అనంతరం కాట్రియాల గ్రామంలో మధ్యాహ్న భోజన వంటకాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అటుపై స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెప్పి మాస్టారుగా మారారు. అంగన్‌వాడీ కేంద్రంలో పాటలు, పద్యాల రూపంలో చిన్నారుల మేధస్సును పరీక్షించారు. వినూత్నంగా జిల్లా కలెక్టర్‌ పర్యటించడం ఇదే తొలిసారి కాదు. గత నెల 18న పొలం బాట పట్టిన కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. 23న సైకిల్‌పై 20 కి.మీ దూరం ప్రయాణించి రామాయంపేట బస్టాండ్‌ను తనిఖీ చేశారు.


ఇవి కూడా చదవండి...

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 13 , 2025 | 04:38 AM