May Day: కార్మికుల శ్రమను గుర్తిద్దాం..
ABN , Publish Date - May 01 , 2025 | 11:06 AM
మే 1.. కార్మికుల దినోత్సవం. హక్కుల సాధన కోసం కార్మికులు చేసిన పోరాటానికి గుర్తుగా మే డే నిలుస్తుంది. ప్రతి కార్మిక వాడల్లోనూ ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా ఎర్రజెండాలు చేతబూని వేడుకలు జరుపుకోవడం ఓ ఆనవాయితీ.

- దేశాభివృద్ధిలో కీలకంగా కార్మికుల పాత్ర
- నేడు మే డే సందర్భంగా ప్రత్యేక కథనం
హైదరాబాద్: హక్కుల సాధన కోసం కార్మికులు చేసిన పోరాటానికి గుర్తుగా మే డే నిలుస్తుంది. ఆధునిక టెక్నాలజీ యుగంలో చాలా మంది కార్మికుల చేత చేయించుకోవాల్సిన పనులను సాంకేతికత సహాయంతో చేయించుకుంటున్నారు. అయితే ఎంత టెక్నాలజీ ఉన్నా ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాల్సిందే. నిర్మాణ రంగంలో తాపీ మేస్ర్తీ, ప్లంబర్, ఎలక్ర్టీషియన్, సెంట్రింగ్, ఫాల్ సీలింగ్, పెయింటర్, టైల్స్ ఫిట్టింగ్ చేసేవారి పాత్ర కీలకం.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నకిలీ పత్రాలతో రూ.27 కోట్ల రుణం తీసుకుని పరార్
ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటివి అందుబాటులోకి వచ్చినా ఆ వాహనాలను నడపాల్సింది మాత్రం డ్రైవర్లే. ఇక కేపీహెచ్‌బీ, మూసాపేట్ ప్రాంతాల్లో కార్మికులకు పెద్ద అడ్డాలే ఉన్నాయి. కంపెనీల్లో పనిచేసే వారంతా 95 శాతం మేర రోజూవారి లేదా నెలవారీ కూలీ తీసుకునే కార్మికులే ఉన్నారు. చాలా మందికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం సైతం ఉండదు.
కార్మికులు పనిచేస్తున్న ప్రదేశంలో వారికి అవసరమయ్యే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు, వర్క్‌మెన్ కాంపన్షేషన్ పాలసీలు ఉండేలా సంబంధిత కాంట్రాక్టర్లు, పనిచేయించుకుంటున్న యజమానులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే కార్మికులు లేబర్ కమిషనర్ కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలను అందుకోవచ్చు. కార్మికులు ఐక్యంగా ఉంటూ తోటి కార్మికుడు లేదా కార్మిక కుటుంబం ఆపదలో ఉంటే వారికి అవసరమైన సహాయ, సహకారాలు అందే విధంగా చొరవతీసుకోవాలి.
కార్మికులను గౌరవిద్దాం..
మనం ఎంత అభివృద్ధి చెందినా కార్మికులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. టెక్నాలజీతో పనులు వేగంగా చేసుకోవచ్చు కానీ కార్మికులు శ్రమతో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. కార్మికులు ఎవరికి వారు అప్డేట్ అయ్యి ఇతర పనుకు వెళ్తే నిత్యం అవసరం అయ్యే ప్లంబర్, ఎలక్ర్టీషియన్, మేస్ర్తీ, పెయింటర్ వంటి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్, గ్రాసరీ, కొరియర్ డెలివరీ బాయ్స్ ఎవరి స్థాయిలో వారు దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. అందువల్లే మన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతున్నాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్‌గాంధీ కుటుంబానికి ఆర్‌ఎస్ఎస్, బీజేపీలు బద్ధ శత్రువులే కదా
ఉద్యోగాల్లేకనే యువత డ్రగ్స్‌కు బానిసలు
Read Latest Telangana News and National News