Mandakrishna Madiga: ఆగస్టు 13న దివ్యాంగుల మహాగర్జన
ABN , Publish Date - Jul 04 , 2025 | 07:07 AM
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలు, ఆసరా పెన్షన్ రూ.4 వేలు, తీవ్ర వైకల్యం గల వారికి రూ. 15 వేలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలు, ఆసరా పెన్షన్ రూ.4 వేలు, తీవ్ర వైకల్యం గల వారికి రూ. 15 వేలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 13న దివ్యాంగులు, ఆసరా పెన్షన్ దారుల మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్(Basheerbagh Press Club)లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్‌బీ స్టేడియంలో మహాగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లోనూ దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
Read Latest Telangana News and National News