Manda Krishna: మాదిగ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:13 AM
తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకున్నట్లే ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు.

వారి త్యాగాలను జాతి మరువదు: మందకృష్ణ మాదిగ
ఉస్మానియా యూనివర్సిటీ, బౌద్ధనగర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకున్నట్లే ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. వారికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో మందకృష్ణ పాల్గొని మాట్లాడారు.
మాదిగ అమరవీరుల స్తూపంతో పాటు మ్యూజియం కోసం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా, శనివారం పార్శీగుట్ట కార్యాలయంలో జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మందకృష్ణ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చునని తీర్చునిచ్చిన సందర్భంగా 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నామని, వారి త్యాగాలను జాతి మరువదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.