Medak: కల్లు సీసాతో పొడిచి.. టవల్‌తో ఉరి వేసి..
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:32 AM
ట్రాక్టర్ కిరాయి డబ్బుల కోసం, మంత్రాల నెపంతో తన అన్నను ఓ తమ్ముడు కల్లు సీసాతో పొడిచి, టవల్‌తో ఉరివేసి కిరాతకంగా చంపేశాడు.

అన్నను చంపిన తమ్ముడు
మెదక్/కొల్చారం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ట్రాక్టర్ కిరాయి డబ్బుల కోసం, మంత్రాల నెపంతో తన అన్నను ఓ తమ్ముడు కల్లు సీసాతో పొడిచి, టవల్‌తో ఉరివేసి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అంశానిపల్లిలో శుక్రవారం జరిగింది. మండలంలోని పసురం తండాకు చెందిన రామావత్ మంత్యా (46) తన తమ్ముడు మోహన్‌కు ట్రాక్టర్ కిరాయి డబ్బులు బాకీ ఉన్నాడు. ఇటీవల అదే తండాకు చెందిన మరొకరి ట్రాక్టర్‌తో తన పొలాన్ని దున్నేందుకు మంత్యా ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనకు డబ్బులు ఇవ్వకపోగా, మరొకరితో ఒప్పందం కుదుర్చుకుంటావా అని ట్రాక్టర్ యాజమాని బిక్షపతిపై తమ్ముడు మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అన్న మంత్యా పొలం దున్నితే ట్రాక్టర్ తగులబెడుతానని బెదిరించారు.
ఈ విషయాన్ని బిక్షపతి మంత్యాకు ఫోన్‌లో వివరించాడు. ఆ సమయంలో మోహన్ కల్లు దుకాణంలో ఉండగా, ఆగ్రహంతో అక్కడికి వచ్చిన మంత్యా తమ్ముడితో గొడవకు దిగాడు. మోహన్ కల్లు సీసాతో అన్నను కిరాతకంగా పొడిచి, టవల్‌తో ఉరి వేశాడు. చనిపోయాడా.. లేదా అనే అనుమానంతో బండరాయి వేశాడు. కొనఊపిరితో ఉన్న మంత్యాను కుటుంబ సభ్యులు కొల్చారం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. కాగా మంత్యా మంత్రాలు చేయడం వల్లే గతనెలలో తన మనుమరాలు చనిపోయిందని మోహన్ అనుమానిస్తున్నాడు. అప్పటి నుంచి అన్నపై ఆగ్రహంతో ఉన్నాడని గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News