Share News

Hyderabad: తలపై రాయితో కొట్టి వ్యక్తి హత్య

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:06 AM

హిమాయత్‌నగర్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టిచూస్తే.. తలపై బండరాయితో బలంగా కొట్టి అతడిని చంపినట్లు అనిపిస్తోంది.

Hyderabad: తలపై రాయితో కొట్టి వ్యక్తి హత్య

  • మృతదేహాన్ని మూటగట్టి అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లోకి

  • హిమాయత్‌నగర్‌లో అర్ధరాత్రి దుండగుల ఘోరం

కవాడిగూడ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): హిమాయత్‌నగర్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టిచూస్తే.. తలపై బండరాయితో బలంగా కొట్టి అతడిని చంపినట్లు అనిపిస్తోంది. మృతదేహం బట్టలేమీ లేకుండా నగ్నంగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. హిమాయత్‌నగర్‌ వీధి నంబరు-8లోని ‘వీ ప్లాజా’ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో మృతదేహం లభ్యమైంది. మృతుడు ఎవరు? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. మృతుడి వయసు 32 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. మద్యం లేదా గంజాయి మత్తులో దుండగులు, ఆ వ్యక్తిపై లైంగికదాడికి పాల్పడి చంపినట్లుగా అనుమానిస్తున్నారు.


సోమవారం ఉదయం ఉడ్చేందుకు వచ్చిన సిబ్బంది.. నేలపై రక్తపు మరకలను చూసి, వస్త్రాలు చెల్లాచెదరుగా పడి ఉండటాన్ని గమనించి ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పక్కనే ఉన్న లిఫ్ట్‌లో నగ్నస్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా ఆదివారం రాత్రి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షట్టర్‌ వద్ద వ్యక్తి నిద్రపోతుంటే, అర్ధరాత్రి దాటాక కొందరు గుర్తు తెలియని వ్యక్తులొచ్చి అతడిని నిద్రలేపి.. పక్కవీధిలోకి తీసుకెళ్లి గొడవపెట్టుకున్నారని స్థానికుల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో అతడి బట్టలు ఊడదీసి లైంగిక దాడికి పాల్పడినట్లుగా చెప్పుకొంటున్నారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్య జరిగినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 05:06 AM