Share News

Manda krishna Madiga: జనాభాకు మించి ఎస్సీ రిజర్వేషన్లను అనుభవించిన మాలలు..

ABN , Publish Date - Mar 01 , 2025 | 11:48 AM

మాలలు జనాభాకు మించి ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాలను అనుభవించారని ఎమ్మార్పీఎస్‌ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Manda krishna Madiga) ఆరోపించారు.

Manda krishna Madiga: జనాభాకు మించి ఎస్సీ రిజర్వేషన్లను అనుభవించిన మాలలు..

హైదరాబాద్: మాలలు జనాభాకు మించి ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాలను అనుభవించారని ఎమ్మార్పీఎస్‌ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ల సమాన కంపెనీ కోసం తాము వర్గీకరణ ఉద్యమం చేపడితే మాలలు అడ్డుకున్నారని విమర్శించారు. జస్టిస్‌ షమీ అక్తర్‌ నివేదిక శాస్త్రీయంగా లేదని గ్రూపుల్లో కులాల చేర్పు సరిగ్గా లేదని, దీనిని సవరించాలన్నారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఎస్సీ కులాల సదస్సు నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: నెల రోజుల పాటు కాచిగూడ-నిజామాబాద్‌ డెమూ రైళ్లు రద్దు


ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎస్సీలలోని నేతకాని, మహార్‌, ఓలియ దాసరి, మాల దాసరి, మిత్‌ అయ్యల్‌వార్‌, డోర్‌, మంగ్‌, మాంగ్‌ గరోడి తదితర కులాలను ప్రత్యేక గ్రూపులో కాకుండా గ్రూపు-3లో చేర్చారని, మాలల ఒత్తిడి వల్లనే ఇది జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో అన్ని కులాలకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమన్నారు. ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


city7.jpg

మాజీ ఎంపీ వెంకటేష్‌ మెహతా(Former MP Venkatesh Mehta) మాట్లాడుతూ నేతకాని కులస్థులను ప్రత్యేక గ్రూపులో చేర్చాలని, మాలలతో కలిసి ఉండమని అన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన నేతలు బి.దీపక్‌కుమార్‌, పృథ్వీరాజ్‌యాదవ్‌, దుర్గం రాజేష్‌, రాంబాబు, బాలాజీ, చంద్రశేఖర్‌, సోమయ్య, కిష్టయ్య, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు

ఈవార్తను కూడా చదవండి: ఆధార్‌ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం

ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి

ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్‌ ఫిషర్‌’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2025 | 11:48 AM