Crime News: సర్వేయర్ హత్య కేసు.. ఇంకా చిక్కని ప్రధాన నిందితుడు..
ABN , Publish Date - Jun 25 , 2025 | 08:04 AM
Crime News: సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తేజేశ్వర్ హత్య కన్నా ముందు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు తన భార్యను హతమార్చేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం.

Jogulamba Gadwala: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు (Surveyor Tejeswar case)లో ప్రధాన నిందితుడు తిరుమలరావు (Tirumalarao) ఇంకా పోలీసులకు దొరకలేదు. అతని కోసం మూడు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. తిరుమలరావు కుటుంబ సభ్యులను పోలీసులు (Police) ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య (Aishwarya), అత్త సుజాత (Sujatha), ఇద్దరు సుపారి హంతకులు, కారు డ్రైవర్, ఓనర్ మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తేజేశ్వర్ హత్య కన్నా ముందు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు తన భార్యను హతమార్చేందుకు ప్లాన్ వేశాడు. భార్యను హత్య చేసి ప్రియురాలు ఐశ్వర్యతో లద్దాఖ్ వెళ్లి, అక్కడే సహజీవనం చేసేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. దీని కోసం పలు కారణాల పేరిట బ్యాంకు నుంచి రూ. 20 లక్షల లోన్ కూడా తీసుకున్నాడు. ప్రియురాలిపై ఉన్న ఇష్టంతో పాటు తన భార్యకు సంతానం కలగకపోవడంతో తిరుమలరావు ఆమెను చంపేయాలని ప్లాన్ వేసినట్లు తెలిసింది. అయితే ముందు నుంచి వీరిద్దరి సంబంధం గురించి తెలిసిన తిరుమలరావు భార్య జాగ్రత్త పడడంతో హత్య ప్రణాళిక తేజేశ్వర్ వైపు మళ్లింది. ప్లాన్ వివరాలను తిరుమలరావు ఐశ్వరకు తెలియజేయడంతో ఆమె అందుకు సరే అన్నట్లు సమాచారం. తేజేశ్వర్ హత్య తర్వాత సుపారీ గ్యాంగ్ సభ్యులు నాగేష్, పరశురాం, పరమేశ్వర్‌లకు తిరుమలరావు రూ. 2 లక్షలు ఇచ్చినట్లు తెలియవచ్చింది. అయితే హత్య విషయం బయటకు రావడంతో మిగతా రూ.18 లక్షలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం.
మరో కొత్త విషయం వెలుగులోకి...
ఐశ్వర్య, అమె తల్లి సుజాతకు తిరుమలరావుతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఐశ్వర్య అన్న నవీన్ జీర్ణించుకోలేకపోయాడని, ఈ అక్రమ వ్యవహారంపై పలుమార్లు చెల్లిని మందలించినట్లు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ క్రమంలో నవీన్ రెండు నెలల క్రితం ఇంట్లో జారిపడి మృతిచెందాడు. అప్పట్లో సాధారణంగా మృతిగానే అందరూ భావించారు. అయితే తేజేశ్వర్ హత్య ఉదంతం నేపథ్యంలో ఇప్పుడు నవీన్ మృతిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
For More AP News and Telugu News