Leopard: కెమెరాకు చిక్కిన చిరుత
ABN , Publish Date - Jul 25 , 2025 | 08:25 AM
మంచిరేవుల గ్రే హౌండ్స్ పక్కనే ఉన్న చిలుకూరు మృగవని పార్కులో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలో చిరుత జాడ కనిపించింది. 15 రోజులుగా చిరుతపులి సంచారం నేపథ్యంలో అధికారులు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.

- అటవీశాఖ అధికారుల వేట
హైదరాబాద్: మంచిరేవుల గ్రే హౌండ్స్ పక్కనే ఉన్న చిలుకూరు మృగవని పార్కు(Chilkur Wildlife Park)లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలో చిరుత(Leopard) జాడ కనిపించింది. 15 రోజులుగా చిరుతపులి సంచారం నేపథ్యంలో అధికారులు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు జింకల పార్కులో రెండు బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
అలాగే, మంచిరేవుల-మొయినాబాద్(Manchirevula-Moinabad) పాత రోడ్డులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పార్కును ఆనుకుని ఉన్న పాత రోడ్డులో సంచరిస్తున్నట్లుగా చిరుతపులి కెమెరాకు చిక్కింది. రోడ్డు దాటుతూ ఫారెస్ట్ శాఖకు చెందిన స్థలంలోకి వెళ్లింది. ఈ రోడ్డుని గతంలో జనాలు ఉపయోగించే వారు. ఔటర్ సర్వీసు రోడ్డు వచ్చిన తర్వాత జన సంచారం లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే రోడ్డులో చిరుత కనిపించింది. ఆ చిరుత బోనులో ఎప్పుడు చిక్కుతుందా అని ఫారెస్టు శాఖ అధికారులు వేచి చూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
Read Latest Telangana News and National News