Share News

Gachibowli: ‘కంచ గచ్చిబౌలి’పై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:21 AM

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఇమ్మనేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు.

Gachibowli: ‘కంచ గచ్చిబౌలి’పై చర్యలు తీసుకోండి

  • ఎన్‌హెచ్‌ఆర్సీకి న్యాయవాది ఫిర్యాదు

న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ఇమ్మనేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. పర్యావరణ నష్టాన్ని అంచనా వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన బుల్డోజర్లతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ చర్యలతో దాదాపు 27 ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సు, సుమారు 135 ఎకరాల్లో షీట్‌ రాక్స్‌, రెండున్నర ఎకరాల్లో కుంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంటున్నట్లు రామారావుకు మానవ హక్కుల కమిషన్‌ సమాచారం ఇచ్చింది.

Updated Date - Jun 27 , 2025 | 05:21 AM