KTR: ఫార్ములా ఈ నోటీసుల పేరిట జోకర్‌లా సీఎం రేవంత్ నాటకాలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:57 AM
పరిపాలన చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి ఫార్ములా ఈ నోటీసుల పేరిట జోకర్‌లా నాటకాలాడుతున్నారని, హామీలు అమలు చేయలేక ప్రజలదృష్టిని మళ్లించేందుకే పూటకోవిధంగా కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్షకు రావాలి: కేటీఆర్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పరిపాలన చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి ఫార్ములా ఈ నోటీసుల పేరిట జోకర్‌లా నాటకాలాడుతున్నారని, హామీలు అమలు చేయలేక ప్రజలదృష్టిని మళ్లించేందుకే పూటకోవిధంగా కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్ములా ఈ రేసు కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం హెచ్‌ఎండీఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ ఖాతాలోనే ఉన్నాయని పేర్కొన్నారు. తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, విచారణ పేరుతో సాగదీసినా ప్రయోజనం లేదన్నారు.. పదేళ్లకిందట నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్‌రెడ్డి కేసుకూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
ఇద్దరిపైకూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. తామిద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి సమక్షంలో టీవీ లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షకు తనతోపాటు దమ్ముంటే రేవంత్‌రెడ్డి కూడా సిద్ధం వాలని సవాల్ విసిరారు. తాజాగా ఏసీబీ నోటీసు వచ్చిందన్న కేటీఆర్.. సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరై అన్నివిధాలుగా సహకరిస్తానన్నారు. చిల్లర చేష్టలతో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న దద్దమ్మ రేంత్‌రెడ్డిని, అసమర్థ కాంగ్రె్‌సను వదిలిపెట్టేదిలేదని, వెంటాడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శుక్రవారం కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సర్జరీ తర్వాత కోలుకుంటున్నట్లు పల్లా ఆయనకు వివరించారు.