KTR: సర్కారు అరాచకాలను ఎండగడతాం
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:46 AM
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు లక్షల సంఖ్యలో హాజరై కేసీఆర్ నాయకత్వంపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను మరింత ఎండగడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారమని ప్రజా సందేశం: కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు లక్షల సంఖ్యలో హాజరై కేసీఆర్ నాయకత్వంపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను మరింత ఎండగడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులతో సోమవారం హైదరాబాద్ నుంచి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బీఆర్‌ఎస్ ప్రజా బలాన్ని ఈ సభ నిరూపించిందని, దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ రజతోత్సవ సభ నిలుస్తుందని అన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారం చేపట్టేది బీఆర్‌ఎస్సేనని లక్షలాది మంది సందేశమిచ్చారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాగా, మాజీ నక్సలైట్‌గా ప్రజా సమస్యలపై పోరాడిన మంత్రి సీతక్క.. రేవంత్‌రెడ్డి చెబితే మాజీ సీఎం కేసీఆర్‌ను ఎలా తిడతారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.