Hyderabad: కేపీహెచ్‌బీలో గజం రూ.2.98లక్షలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:45 AM
రాజధాని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో గృహ నిర్మాణ మండలి పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్ల వేలంలో.. ఒక కమర్షియల్ ప్లాట్ ధర గజం రూ.2.98 లక్షలు పలికింది.

హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంలో అత్యధిక ధర
హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ప్లాట్లు
18 స్థలాల విక్రయంతో బోర్డుకు రూ.142 కోట్లు
2000 సంవత్సరంలో అక్కడ గజం రూ.1818
హైదరాబాద్, కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో గృహ నిర్మాణ మండలి పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్ల వేలంలో.. ఒక కమర్షియల్ ప్లాట్ ధర గజం రూ.2.98 లక్షలు పలికింది. చదరపు గజం ధర ఇంత భారీగా పలకడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని రాష్ట్ర గృహ నిర్మాణ మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ ఐఏఎస్ వి.పి.గౌతమ్ తెలిపారు. హౌసింగ్ బోర్డు పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలకు బుధవారం కేపీహెచ్‌బీ ఫంక్షన్ హాల్‌లో వేలం నిర్వహించారు. వీటిలో నాలుగు నివాసస్థలాలు కాగా.. 13 వాణిజ్య క్యాటగిరి, కైతలాపూర్‌లో ఉన్న బిట్టుతో కలిపి మొత్తం 18 స్థలాలు. వేలంలో ఇవన్నీ.. అధికారుల అంచనాలకు మించి హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ ప్లాట్లలో 194 చదరపు గజాల నుంచి 978 చదరపు గజాల వరకూ రకరకాల విస్తీర్ణం గ లవి ఉన్నాయి.
వీటిలో 22వ నంబరు ప్లాట్‌కు (151 చదరపు గజాలు, కమర్షియల్) చదరపు గజానికి రూ.2.98లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. కాగా మొత్తం 18 ప్లాట్లు కలిపి 6,236.33 చదరపు గజాలను వేలం వేయగా సగటున ఒక్కో గజానికి రూ.2.38 లక్షల చొప్పున ధర పలికింది. 5 ప్లాట్లు మిన హా మిగతావన్నీ రూ.2.5 లక్షలకు పైగానే పలికాయి. వేలం పాటలో పాల్గొని ఈ ప్లాట్ల ను కొనుగోలు చేసిన వారు రెండు రోజుల్లో 4వ వంతు సొమ్మును, 30 రోజుల్లో 75ు సొమ్మును చెల్లించాలి. మొత్తం 18 ప్లాట్ల వే లంతో బోర్డుకు రూ.142.78 కోట్ల మేర ఆదా యం సమకూరనుంది. వేలంలో 84 మంది పాల్గొన్నారు. కాగా.. కేపీహెచ్‌బీలో.. 13.11.2000న గజం రూ.1818కే రిజిస్ట్రేషన్ చేశారు. అప్పట్లో ఇక్కడ జాగా తీసుకున్న వారు.. తాజా వేలంలో గజం ఏకంగా రూ.2.5 లక్షల దాకా పలకడంతో ‘వామ్మో’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వేలం ధరలు.. ప్లాట్ల వారీగా
క్రమసంఖ్య ప్లాట్ నంబరు చ.గజాలు వేలం పాట ధర
(గజం రూ.లక్షల్లో)
1 54 (ఎంఐజీ) 194.44 2,50,000
2 55 (ఎంఐజీ) 194.44 2,50,000
3 56 (ఎంఐజీ) 194.44 2,42,000
4 57 (ఎంఐజీ) 194.44 2,35,000
5 17 220.38 2,81,000
6 18 254.44 2,40,000
7 19 292 2,88,000
8 20 249.32 2,71,000
9 21 270.2 2,72,000
10 22 151.92 2,98,000
11 23 266.84 2,42,000
12 24 921.13 1,90,000
13 25 789.27 1,70,000
14 26 978.92 1,80,000
15 27 484.6 2,17,000
16 28 389.39 1,84,000
17 29 446 2,22,000
18 కైతలాపూర్ 36.16 1,14,000
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..