Share News

G. Kishan Reddy: మందకృష్ణ పోరాటంతోనే వర్గీకరణ

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:00 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ ఎనలేని కృషి చేశారని, ఆయన అలుపెరుగని పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

G. Kishan Reddy: మందకృష్ణ పోరాటంతోనే వర్గీకరణ

  • కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. బోయినపల్లిలో మందకృష్ణకు సత్కారం

బోయినపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ ఎనలేని కృషి చేశారని, ఆయన అలుపెరుగని పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. మిత్రమండలి నాయకుడు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా బోయినపల్లిలో శనివారం అలయ్‌బలయ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.


కిషన్‌ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌, కంటోన్మెంట్‌ బోర్డు సివిలియన్‌ నామినేటెడ్‌ సభ్యురాలు నర్మద మల్లికార్జున్‌ పాల్గొని మందకృష్ణను గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మందకృష్ణ స్ఫూర్తిగా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు తదితర అనేక ప్రాంతాలకు వర్గీకరణఉద్యమం విస్తరించిందన్నారు. కంటోన్మెంట్‌ బీజేపీ నాయకులు, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో పాటు మందకృష్ణ అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 05:00 AM