Kishan Reddy: రోజ్‌గార్ మేళాలో 114 మందికి నియామక పత్రాలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:28 AM
రోజ్‌గార్ మేళా సందర్భంగా శనివారం సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

అందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : రోజ్‌గార్ మేళా సందర్భంగా శనివారం సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ శాఖలకు నూతనంగా ఎంపికైన 114 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ప్రదానం చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, గుంతకల్లు, గుంటూరులతో పాటు జాతీయ స్థాయిలో 47 ప్రదేశాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 16వ రోజ్‌గార్ మేళాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఎంపికైన సుమారు 51 వేల మందికి పైగా ఉద్యోగులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో ఏర్పాటైన మేళాలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్దార్థ్ కటి, సికింద్రాబాద్ డివిజనల్ ఆర్‌ఎం భరతేష్ కుమార్ జైన్ పాల్గొన్నారు.