Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌తో స్నేహమే కేజ్రీవాల్‌ను ముంచింది
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:30 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంతో ఉన్న స్నేహమే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ముం చాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంతో ఉన్న స్నేహమే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ముం చాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ కుమార్తె కవితపై వచ్చిన మద్యం కుంభకోణం ఆరోపణలు ఆప్ ఓటమికి కారణమని చెప్పారు. కాంగ్రె్‌సను శత్రువుగా చూడడం కేజ్రీవాల్ పతనానికి నాంది పలికిందని తెలిపారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కేజ్రీవాల్ స్వయం కృతాపరాధమే కారణమని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని కేజ్రీవాల్ శత్రువుగా పరిగణించడం, కాంగ్రె్‌సతో పొత్తు వద్దనుకోవడమే బీజేపీ నెత్తిన పాలు పోసిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రె్‌సతో కలిసి పోటీ వద్దనుకోవడం అవగాహన రాహిత్యమా లేక ముం దస్తు అవగాహనతోనా? అన్నది అర్థంకాని విషయమని వ్యాఖ్యానించారు. రాజకీయ ముఖచిత్రంలో బీజేపీకి చోటు లేదని మహే్‌షకుమార్‌గౌడ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుతో కేటీఆర్ ఊహల్లో విహరిస్తున్నారని, కానీ తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందన్న సంగతి ఆయన తెలుసుకోవాలన్నారు.