ఆ పిట్టల దొర.. మళ్లీ అధికారంలోకా?: చామల
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:17 AM
తెలంగాణకు కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘లేవడానికి చేతగాని పిట్టల దొర.. మళ్లీ అధికారంలోకి రావాలంటూ తుపాకీ రాముడు అనడం హాస్యాస్పదంగా ఉంది. బుద్ధి ఉన్నోళ్లు ఎవరైనా బీఆర్‌ఎస్ పాలనను మళ్లీ కోరుకుంటారా?’ అంటూ ధ్వజమెత్తారు. అసలు రజతోత్సవ సభ టీఆర్‌ఎ్‌సకా.. లేక బీఆర్‌ఎస్ పార్టీకా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి.. రజతోత్సవ సభను ఎలా నిర్వహిస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో.. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఏమీ చేయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లు సైతం మత పరంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి
BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం
Cybercrime: సైబర్ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News