Kavitha: సవతి తల్లి మీది.. తెలంగాణ తల్లి మాది: కవిత
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:27 AM
శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కవితతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు.

మనోహరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ‘సవతి తల్లి మీది.. తెలంగాణ తల్లి మాది’ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కవితతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని కోదండరామ చంద్రస్వామి ఆలయంలో సీతారాములను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మళ్లీఅధికారంలోకి వస్తుందని, అప్పుడు మళ్లీ తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరుతూ జీపీ కార్మికులు కవితకు వినతిపత్రం అందజేశారు.