Kalvakuntla Kavitha: శ్రీకాంతాచారి పేరు ఒక్క పథకానికైనా పెట్టారా...
ABN , Publish Date - Dec 04 , 2025 | 09:57 AM
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి పేరును ఒక్క పథకానికైనా ఎందుకు పెట్టడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ప్రస్తుత పాలకులకు రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ గుర్తుకొస్తున్నారు కాని శ్రీకాంతాచారి గుర్తుకు రాకపోవడం దారుణమన్నారు.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
- చారి విగ్రహం వద్ద నివాళి
హైదరాబాద్: ఒక్క ప్రాజెక్టుకైనా అమరుడైన శ్రీకాంతాచారి(Srikanthachari) పేరు పెట్టారా? అని కాంగ్రెస్ నేతలను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) నిలదీశారు. అమరులను గౌరవిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ .. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్(Rajiv Gandhi, Indira Gandhi, Manmohan Singh) పేర్లనే ప్రాజెక్టులకు పెట్టిందన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా బుధవారం ఎల్బీనగర్‌లోని మహనీయుల విగ్రహాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. నిజంగా త్యాగం చేసినటువంటి తెలంగాణ బిడ్డల పేర్లు నిలిచేలా పాటుపడాలని, అందుకు తెలంగాణ జాగృతి పాటుపడుతోందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News
