Kacheguda-Mysore Express: అశోకపురం వరకు కాచిగూడ- మైసూర్ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:15 PM
కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్ రైలు (12785, 12786)ను అశోకపురం వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కాచిగూడ- మైసూరు-కాచిగూడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఇక నుంచి కాచిగూడ-అశోకపురం-కాచిగూడ మధ్య నడపడానికి రైల్వే బోర్డు అనుమతించిందన్నారు.

హైదరాబాద్: కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్(Kacheguda-Mysore Express) రైలు (12785, 12786)ను అశోకపురం వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కాచిగూడ- మైసూరు-కాచిగూడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఇక నుంచి కాచిగూడ-అశోకపురం-కాచిగూడ మధ్య నడపడానికి రైల్వే బోర్డు అనుమతించిందన్నారు.
పలు రైళ్లకు అదనంగా స్లీపర్ కోచ్‌లు సెప్టెంబరు చివరి వారం నుంచి హైదరాబాద్-సీఎస్టీ ముంబై, సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య నడిచే రైళ్లకు అదనంగా రెండేసి స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నట్టు అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబరు 23 నుంచి హైదరాబాద్-సీఎస్టీ ముంబై (22731), 26 నుంచి సీఎ్‌సటీ ముంబై-హైదరాబాద్ (22732), 24 నుంచి సీఎస్టీ ముంబై-హైదరాబాద్ (12701), 25 నుంచిహైదరాబాద్-సీఎస్టీ ముంబై(12702) రైళ్లకు అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 23 నుంచి సికింద్రాబాద్-భువనేశ్వర్(17016), 25 నుంచి భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) రైళ్లకు అదనంగా మూడు స్లీపర్ కోచ్‌లను జత చేయనున్నట్టు పేర్కొన్నారు.
19 ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని 19 ప్రత్యేక రైళ్లు నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 28 వరకు (ఆదివారం) తిరుపతి-సాయినగర్ శిరిడి (07637), ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 29 వరకు (సోమవారం)సాయినగర్ షిరిడి-తిరుపతి (07638) 18 సర్వీసులు, ఈనెల 26 ధర్మవరం-సోలాపూర్ (01438) ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
Read Latest Telangana News and National News