Jupally Krishna Rao: అర్హులైన కళాకారులందరికీ పింఛన్లు: జూపల్లి
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:56 AM
రాష్ట్రంలో అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పింఛన్లు ఇస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పింఛన్లు ఇస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పేర్కొన్నారు. కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శనివారం రవీంద్రభారతిలో మంత్రిని మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం ఆధ్వర్యంలో పలువురు కళాకారులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పింఛను ఇచ్చే అంశంపై సీఎంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.
ఈ ఏడాదిలో 7 కోట్ల మొక్కలు నాటాలి: సీతక్క
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛదనం పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది 7 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో శనివారం సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. గత ఏడాదిలో 6.90 కోట్ల మొక్కలు నాటామని, వాటిలో ఎన్ని బతికాయో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈసా రి వ్యవసాయ అనుబంధ మొక్కలు పెంచే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, తాటి, ఈత, పండ్ల మొక్కలను నాటాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి
Read Latest Telangana News And Telugu News