Jagruthi: కవితకు తీన్మార్ మల్లన్న క్షమాపణలు చెప్పాలి
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:46 AM
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా తీన్మార్ మల్లన్న క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే మరిన్ని దాడులు..
తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్
బర్కత్‌పుర, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా తీన్మార్ మల్లన్న క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు. బీసీల కోసం కవిత ఉద్యమిస్తుంటే జీర్ణించుకోలేని తీన్మార్ మల్లన్న.. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ బోళ్ల శివశంకర్, తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి ఎలిజాల దత్తాత్రేయ మాట్లాడారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వ్యక్తిగత దూషణల కారణంగా క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగిందని, నోటి దురుసును తగ్గించుకోకపోతే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు. బీసీ ఉద్యమాన్ని భూజాన ఎత్తుకున్న ఎమ్మెల్సీ కవిత.. ఏ కులంలో పుడితే మల్లన్నకు ఎందుకని ప్రశ్నించారు. బెదిరింపులు, ఆర్థిక నేరాలకు పాల్పడే మల్లన్న స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారతాడని మండిపడ్డారు.