Jaggareddy: మా కుమార్తె వివాహానికి రండి
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:05 AM
తమ కుమార్తె జయరెడ్డి వివాహం వచ్చే నెల 7న జరగనుందని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు.

రాహుల్‌గాంధీకి జగ్గారెడ్డి దంపతుల ఆహ్వానం
న్యూఢిల్లీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తమ కుమార్తె జయరెడ్డి వివాహం వచ్చే నెల 7న జరగనుందని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. జగ్గారెడ్డి, ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కుమార్తె జయరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు సోమవారం రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాహుల్‌గాంధీకి నూతన వస్త్రాలతోపాటు వివాహ శుభలేఖను జగ్గారెడ్డి దంపతులు అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తమ కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించారు.