Share News

Jagga Reddy: హోలీ వేడుకల్లో జగ్గారెడ్డి సందడి

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:48 AM

హోలీ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో తన చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు.

Jagga Reddy: హోలీ వేడుకల్లో జగ్గారెడ్డి సందడి

మిత్రులు, సన్నిహితులపై రంగులు చల్లి.. నృత్యాలు చేసిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

  • ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష

సంగారెడ్డి టౌన్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హోలీ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో తన చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు. మూడు గంటల పాటు సాగిన కార్యక్రమంలో డీజే పాటలు, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్‌లు వేశారు. తానే స్వయంగా డప్పు కొడుతూ నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పట్టణంలోని రాంమందిర్‌ కమాన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాంమందిర్‌ వద్ద రెండు దశబ్దాలుగా హోలీ సంబురాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు.


తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకొనే పండుగల్లో హోలీ ఒకటని, పండుగ వేళ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సంగారెడ్డిలో హోలీ పండుగను ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రకాల రంగుల మాదిరిగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. నిరంతరం ఏదో ఒక సమస్య ఉంటుందని, అన్నీ మర్చిపోయి సంతోషంగా హోలీ జరుపుకునేందుకు తన వంతు ప్రయత్నం చేశానన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 04:48 AM