ఆన్‌లైన్ బెట్టింగులతో అప్పుల పాలు
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:56 AM
ఆన్‌లైన్ బెట్టింగుల్లో అప్పులపాలైన ఓ ఐటీ ఉద్యోగి.. ఉద్యోగం మానేసి గంజాయి దందా మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఏపీకి చెందిన శ్రీనివాసులు కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు.

ఐటీ ఉద్యోగం మానేసి గంజాయి దందా
ముగ్గురి అరెస్టు.. 40 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ బెట్టింగుల్లో అప్పులపాలైన ఓ ఐటీ ఉద్యోగి.. ఉద్యోగం మానేసి గంజాయి దందా మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఏపీకి చెందిన శ్రీనివాసులు కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు. ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడిన అతడు అధిక మొత్తంలో అప్పులు చేశాడు. అతడి బంధువుల్లో ఒకరు గంజాయి దందా చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలుసుకుని ఆ పని మొదలు పెట్టాడు.
ఒడిశాకు చెందిన బాలాహంతల్ అలియాస్ స్టీవ్, అలియాస్ రాజు, అలియాస్ రంజు నుంచి గంజాయిని కొనుగోలు చేసేవాడు. డెలివరీ కోసం ఏపీకి చెందిన తన స్నేహితుడు అభిషేక్‌ను నియమించుకున్నాడు. బాలహంతల్ నుంచి హైదరాబాద్‌లో గురువారం శ్రీనివాస్ గంజాయి తీసుకుంటుండగా దాడి చేసి 40 కిలోల గంజాయి, ప్యాకింగ్ సామగ్రి, కేటీఎం బైక్, 3 మొబైల్ పోన్లు, రూ.40,440 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.