Flight Diversion: టేకాఫ్ కాగానే విమానంలో సాంకేతిక సమస్య
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:36 AM
తిరుపతి నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్ బయల్దేరిన ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య ఏర్పడింది. దాంతో కాసేపు గాల్లో చక్కర్లు కొట్టి..

తిరుపతి-హైదరాబాద్ సర్వీసు రద్దు
రేణిగుంట/శంషాబాద్ రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్ బయల్దేరిన ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య ఏర్పడింది. దాంతో కాసేపు గాల్లో చక్కర్లు కొట్టి.. తిరిగి తిరుపతిలోనే ల్యాండయ్యింది. అనంతరం ఈ సర్వీసును అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి 7.10గంటల సమయంలో తిరుపతికి వచ్చిన ఇండిగో విమానం.. 7.30గంటలకు 200 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయింది. కొంతసేపటికి సాంకేతిక సమస్య తలెత్తడంతో, అర్ధగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టి.. తిరిగి 8గంటలకు రన్‌వేపై ల్యాండ్ అయింది.
విమానంలో ఉన్న ప్రయాణికులను వెయిటింగ్ లాంజ్‌లోకి పంపించి 8.30 గంటలకు వారికి బోర్డింగ్ పాసులు అందించారు. కొంతసేపటికి విమానంలో తిరిగి సాంకేతిక సమస్య తలెత్తడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించి ప్రయాణికులను వెనక్కి పంపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్ చేస్తామని యాజమాన్యం తెలపడంతో వెనుదిరిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News