Share News

Indigo flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:57 AM

ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఇండిగో విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు నాలుగు గంటల పాటు పడిగాపులు కాశారు.

Indigo flight: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

  • శంషాబాద్‌ విమానాశ్రయంలో 4 గంటల పాటు పడిగాపులు

శంషాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఇండిగో విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు నాలుగు గంటల పాటు పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన ఎస్‌జీ 773 ఇండిగో విమానంలో బోర్డింగ్‌ పాస్‌లు తీసుకున్న తరువాత సాంకేతిక లోపం తలెత్తిందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు.


దీంతో నాలుగు గంటలు విమానాశ్రయంలోనే పడిగాపులు కాయాల్సి రావడంతో ప్రయాణికులు విమానం దిగి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ టికెట్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒక సమయంలో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిపై దాడి చేయడానికి యత్నించడంతో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు. ఎట్టకేలకు విమానం మధ్యాహ్నం 1.55 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లింది.

Updated Date - Feb 27 , 2025 | 04:57 AM