Indigo Airlines: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:42 AM
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు సరఫరా చేసే ఓ సంస్థ ప్రమాణాలు పాటించడం లేదని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ (సీఎ్‌ఫఎస్)తెలంగాణ టాస్క్‌ఫోర్స్ బృందం నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది.

ఇన్‌స్టాహాట్ ఫుడ్స్ సంస్థలో తనిఖీల్లో గుర్తింపు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు సరఫరా చేసే ఓ సంస్థ ప్రమాణాలు పాటించడం లేదని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ (సీఎ్‌ఫఎస్)తెలంగాణ టాస్క్‌ఫోర్స్ బృందం నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. ఈ సంస్థ వివిధ ప్రాంతాలకు ఎగుమతులు కూడా చేస్తోంది. గురువారం పటాన్‌చెరు ఐడీఏలో ఇన్‌స్టాహాట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి పలు ఉల్లంఘనలు గుర్తించినట్టు సీఎ్‌ఫఎస్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొంది.
ఈ సంస్థనే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు సరఫరా చేస్తోందని తెలిపింది. ప్రమాణాలు పాటించకుండా వస్తువులు నిల్వ చేశారని పేర్కొంది. లీకవుతున్న ఏసీ కింద కొన్ని ఆహార వస్తువులు, పాడైన టమోటాలు, వంట చేసే ప్రాంతంలో బొద్దింకలను గుర్తించినట్లు వెల్లడించింది. అదే ప్రాంతంలోని అసటి రాజ్‌కుమార్ రోలర్ ఫ్లోర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ బృందం తనిఖీలు నిర్వహించింది. దానికి ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) అనుమతిలేదని, సిబ్బంది పరిశుభ్రత పాటించడం లేదని, నీటి నాణ్యత వివరాలు లేవని తెలిపింది.