IAS officers: ఎవరా ఐఏఎస్‌లు?
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:58 AM
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే పలువురు ఐఏ ఎస్‌లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పథకాల రూపకల్పనలో ముందుచూపు కొరవడుతోందని, కిందిస్థాయి అధికారులు, ఉద్యోగుల పట్ల దరుసుగా వ్యవహరిస్తున్నారని..

ఆరా తీస్తున్న నిఘా వర్గాలు
చర్చనీయాంశంగా ఆంధ్రజ్యోతి ‘మేం మారేదే లే’ కథనం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే పలువురు ఐఏ ఎస్‌లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పథకాల రూపకల్పనలో ముందుచూపు కొరవడుతోందని, కిందిస్థాయి అధికారులు, ఉద్యోగుల పట్ల దరుసుగా వ్యవహరిస్తున్నారని ‘‘మేం మారేదే లే’’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ సహచరుల్లో ఎవరై ఉంటారోనంటూ కొంతమంది ఐఏఎస్ అధికారులు ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్నట్టు సమాచారం.
మరోవైపు ఆ ఐఏఎ్‌సలు ఎవరు? వారు నిర్వర్తిస్తున్న విధులేంటి? ఆయా శాఖలు ఏమిటనేదానిపై నిఘా వర్గాలు ఆరా తీశాయి. కథనంలో పేర్కొన్న వివరాల మేరకు ఆయా శాఖల అధికారులు, వారి పని తీరు గురించి వాకబు చేశారు. ఓ శాఖలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎ్‌సగా మారిన వ్యవహారం ఏంటి? ఎందుకు వారిద్దరి మధ్యన సమస్య తలెత్తిందనే అంశంపై ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దృష్టి సారించినట్టు తెలిసింది.