Share News

HYDRA: ఇక.. పూడికతీత పనుల్లో హైడ్రా..

ABN , Publish Date - Jul 31 , 2025 | 08:34 AM

నగరంలోని నాలాలు, క్యాచ్‌పిట్లు, కల్వర్టుల్లోని చెత్తను హైడ్రా బృందాలు తొలగిస్తున్నాయి. హైడ్రా డీఆర్‌ఎఫ్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్సు), ఎంఈటీ (మాన్సూన్‌ ఎమర్జన్సీ టీమ్స్‌) బృందాలు నిరంతరాయంగా నాలాల్లో చెత్తను తొలగిస్తున్నాయి.

HYDRA:  ఇక.. పూడికతీత పనుల్లో హైడ్రా..

- సాఫీగా వరద నీరు

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని నాలాలు, క్యాచ్‌పిట్లు, కల్వర్టుల్లోని చెత్తను హైడ్రా బృందాలు తొలగిస్తున్నాయి. హైడ్రా డీఆర్‌ఎఫ్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్సు), ఎంఈటీ (మాన్సూన్‌ ఎమర్జన్సీ టీమ్స్‌) బృందాలు నిరంతరాయంగా నాలాల్లో చెత్తను తొలగిస్తున్నాయి. కల్వర్టులు, క్యాచ్‌పిట్లు, వరద కాలువల వద్ద లారీల కొద్దీ పూడిక బయట పడుతోంది. అల్వాల్‌లోని బృందావన్‌ కాలనీ కల్వర్టులో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు, సిల్ట్‌ను తొలగించడంతో వరద నీరు సాఫీగా వెళ్తోంది.


city4.2.jpg

బుల్కాపూర్‌ నాలాలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సిల్ట్‌తో పాటు, చెత్త తొలగించే పనులు కొనసాగుతున్నాయి. టోలిచౌకీ(Tolichawki) ప్రాంతంలోని హకీంపేట, హఫీజ్‌బాబానగర్‌, సాబాజ్‌కాలనీ అయేషా మసీద్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో టన్నుల కొద్దీ చెత్త బయట పడుతోంది. బోరబండ(Borabanda) పెద్దమ్మనగర్‌లో వర్షం పడితే నీరు రహదారులను ముంచెత్తేది. సిల్ట్‌ తొలగించడంతో నీరు సాఫీగా పోతోంది. కూడికుంట లేక్‌ ఔట్‌ లెట్‌లో పేరుకుపోయిన చెత్తను కూడా హైడ్రా బృందాలు తొలగించాయి.


city4.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2025 | 08:34 AM