Share News

AV Ranganath: చెరువుల సామర్థ్ధ్యంపై అధ్యయనం

ABN , Publish Date - Jun 25 , 2025 | 09:32 AM

చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, అందులోకి వచ్చే వరద ప్రవాహం, అలుగులు, అవుట్‌లెట్ల ద్వారా దిగువకు వెళ్లే వర్షపు నీటిపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు.

AV Ranganath: చెరువుల సామర్థ్ధ్యంపై అధ్యయనం

- వరద నీటి నిర్వహణలో ఇది కీలకం

- సమన్వయంతో పని చేస్తేనే ఫలితం

- మరో మూడు రోజుల్లో అత్యవసర బృందాలు

- సమీక్షా సమావేశంలో రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ: చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, అందులోకి వచ్చే వరద ప్రవాహం, అలుగులు, అవుట్‌లెట్ల ద్వారా దిగువకు వెళ్లే వర్షపు నీటిపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రోడ్లపై వరద నీరు ఎక్కువ సేపు నిలవకుండా, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోనున్నట్టు తెలిపారు. మంగళవారం ట్రాఫిక్‌ విభాగం అధికారులతో ఆయన సమావేశమయ్యారు.


city5.2.jpg

ఈ సందర్భంగా వరద నీరు నిలిచే ప్రాంతాలు, అక్కడి సమస్యలను అధికారులు వివరించారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో 349 ప్రాంతాలు వరద ముంపు ఉన్నట్టు గుర్తించామని, ఆ ఏరియాలకు చెందిన సంబంధిత శాఖ అధికారులు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ సమాచారం ఇవ్వగానే అప్రమత్తంగా ఉండాలని రంగనాథ్‌ సూచించారు. మూడు రోజుల్లో వర్షాకాల అత్యవసర బృందాలు అందుబాటులోకి వస్తాయని రంగనాథ్‌ పేర్కొన్నారు.


ప్రజలకు హైడ్రా వినతి

చెరువులు, నాలాల కబ్జాకు గురైతే 87124 06899 నెంబర్‌ ద్వారా హైడ్రాకు సమాచారమివ్వాలని హైడ్రా ప్రజలను కోరింది. 72079 23085 నెంబర్‌కు వివరాలు పంపి హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ దృష్టికి తీసుకురావచ్చన్నారు. వరద నీరు నేరుగా చెరువుల్లోకి చేరేలా హైడ్రా చర్యలు తీసుకుంటోందని పౌరులూ సహకరించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 25 , 2025 | 09:32 AM