Share News

Gulzar House Fire Accident: ఇవీ.. మన వ్యవస్థలు.. అగ్నిప్రమాదపు షాకింగ్ నిజాలు

ABN , Publish Date - May 31 , 2025 | 02:20 PM

మన ప్రభుత్వ వ్యవస్థల్లోని నిలువెత్తు నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని కళ్లకు కట్టేలా చెబుతున్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదపు బాధిత కుటుంబ సభ్యులు. వాళ్లు చెబుతున్న షాకింగ్ నిజాలు నిర్ఘాంత పరిచేలా ఉన్నాయి.

Gulzar House Fire Accident: ఇవీ.. మన వ్యవస్థలు.. అగ్నిప్రమాదపు షాకింగ్ నిజాలు
Gulzar House Fire Accident Shocking Facts

ఇంటర్నెట్ డెస్క్: రెండు వారాల క్రితం హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగి ఒకే ఫ్యామిలీకి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

7.jpgఅయితే, ఇప్పుడు ఆంధ్రజ్యోతితో గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద బాధిత కుటుంబీకులు సంతోషి గుప్త, నితీష్ గుప్తా అత్యంత బాధాకరమైన విషయాల్ని పంచుకున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలు వాళ్ల మాటల్లోనే వెంటే..

5.jpg


  • గుల్జర్ హౌస్ అగ్నిప్రమాదంలో అధికారులు నిర్లక్ష్యం వల్లే 17 మంది మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయాము.

  • సమాచారం అందుకున్న తర్వాత ఫైర్ సిబ్బంది 40 నిమిషాలు ఆలస్యంగా ఘటనస్థలికి వచ్చారు.

  • ఫైర్ ఇంజన్లో వాటర్ కూడా లేవు.. సుమారు గంటన్నర సమయాన్ని ఫైర్ సిబ్బంది వృధా చేశారు.

  • త్వరగా మంటలు ఆర్పి లోపలికి వెళ్లి ఉంటే.. మా వాళ్లు 17మంది ప్రాణాలు దక్కేవి.

  • Fire accident 2.jpg

  • ఫైర్ సిబ్బంది దగ్గర సరైన పరికరాలు ఆక్సిజన్ కిట్ మాస్క్ లేకపోవడంతో లోపలికి వెళ్లలేదు.

  • ఫైర్ సిబ్బంది వద్ద కనీసం టార్చ్ లైట్ కూడా లేదు, ఫైర్ సిబ్బంది టార్చ్ లైట్ కూడా మమ్మల్ని అడిగారు.

  • ఫైర్ సిబ్బందికి కనీసం నిచ్చెన ఎక్కడానికి కూడా చేతకాలేదు.. ఫైర్ సిబ్బందికి కనీస శిక్ష ఇవ్వలేదు.

  • ఘటనా స్థలానికి వచ్చిన పోలీస్ ఏం చేయకుండా ఉండిపోయారు. తమకు స్థానికులు సహాయం చేశారు.

  • Fire accident 1.jpg

  • ఫైర్ సమయంలో బాధితులను తరలించడానికి అంబులెన్స్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవు.

  • గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లితే ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యంతో ముగ్గురు చనిపోయారు.

  • పోలీస్ కేసు నమోదు కాకుంటే మేము వైద్యం చేయమని ఉస్మానియా డాక్టర్లు నిరాకరించారు.

  • అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే మా ఫ్యామిలీలో 17 మందినీ కోల్పోయాం.

  • fire-accident.gif

  • ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం తమను తీవ్రంగా కలిచి వేసింది.

  • గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరపాలి.

  • ప్రభుత్వం నుండి మాకు నష్టపరిహారం అక్కర్లేదు. ఈ తప్పులు మరోసారి జరక్కుండా చూసుకుంటే అంతే చాలు.

  • 4.jpg


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు

NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!

Read Latest Telangana News and National News

Updated Date - May 31 , 2025 | 02:35 PM