TGPSC: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:25 PM
TGPSC: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 574 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఈ సందర్భంగా టీజీపీఎస్సీ ప్రకటించింది.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ (Telangana Hostel Welfare Officers) ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ (TGPSC) సోమవారం రిలీజ్ చేసింది. మొత్తం 574 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఈ సందర్భంగా టీజీపీఎస్సీ ప్రకటించింది. తుది జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.tspsc.gov.in/) చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
కాగా.. గత ఏడాది జూన్ 24 నుంచి 29 తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షలు జరిగాయి. కంప్యూటర్ ఆధారీతంగా రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 581 పోస్టులకు గాను 82,873 మంది పరీక్షకు హాజరయ్యారు. కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, శిశు సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది (2024) జూన్‌లో పరీక్షలు జరుగగా... ఇప్పటికే జీఆర్‌ఎల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. నాలుగు విడుతల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌ను పూర్తి చేసింది. తాజాగా తుది ఫలితాలు విడుదలయ్యాయి.
ఇవి కూడా చదవండి...
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్
Read Latest Telangana News And Telugu News