Tragedy: ఎల్బీనగర్‌లో దారుణం.. ఇద్దరు సజీవ దహనం..
ABN , Publish Date - Jun 15 , 2025 | 10:04 AM
Tragedy: ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. హై టెన్షన్ కరెంట్ వైర్ బీడింగ్ తెగిపడడంతో ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. వారు బిక్షాటన చేసుకునే వారిగా తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: ఎల్బీనగర్ (LB Nagar)లో దారుణం (Tragedy) జరిగింది. విద్యుత్ తీగలు (Electric wire) తెగిపడి ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న (Footpath sleeping) ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం (Two Burnt) అయ్యారు. 11కేబీ విద్యుత్ తీగలు తెగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఓ ఆలయం వద్ద నిద్రపోతున్న ఇద్దరిపై కరెంట్ తీగలు పడ్డాయి. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఓ వీధి కుక్క సయితం మృతి చెందింది. జరిగిన ప్రమాదానికి సంబంధించి విద్యుత్ అధికారులు ఎలక్ట్రికల్ లైన్‌ను పరిశీలిస్తున్నారు.
ఆ సమయంలో విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. హై టెన్షన్ కరెంట్ వైర్ బీడింగ్ తెగిపోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఫుట్‌పాత్‌పై పడుకున్న వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది. వారు బిక్షాటన చేసుకునే వారిగా తెలియవచ్చింది. ఇద్దరి మృత దేహాలు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్
ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు
For More AP News and Telugu News
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..