Share News

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

ABN , Publish Date - Apr 29 , 2025 | 06:50 PM

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె తేదీని ప్రకటించింది. అయితే తమ సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మే 5వ తేదీ ఆర్టీసీ కార్మికులంతా కవాతు నిర్వహిస్తారని ప్రకటించింది.

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
TGSRTC

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె తేదీని ప్రకటించారు. మే 7వ తేదీ నుంచి కార్మికలు సమ్మెకు వెళ్లబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న స్పష్టం చేశారు. మేడే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్దమయ్యామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమావేశమైంది. ఈ సందర్భంగా సమ్మె‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆర్టీసీ కార్మిక జేఏసీ విడుదల చేసింది. అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న మాట్లాడుతూ.. సమ్మెకు ముందు అంటే.. మే 5వ తేదీన ఆర్టీసి కార్మికులు.. కార్మిక కవాతు నిర్వహిస్తామన్నారు.

ఆర్టీసి కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు ఈ సమ్మెకు మద్దతుగా ఆర్టీసి యూనిఫారంలో కార్మికులంతా ఈ కవాతులో పాల్గొంటారన్నారు. అయితే కొన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాలు జేఏసీలోకి వస్తామని చెప్పి.. మళ్లీ యాజమాన్యంతో మద్దతుగా తమతో కలవడం లేదన్నారు. యూనియన్‌లకు అతీతంగా అందరు సమ్మెకు కలిసి రావాలి ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న పిలుపు నిచ్చారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంత చేయాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.


ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసి నడపాలన్నారు. 2021 వేతన సవరణ చేయాలని.. అలాగే పెండింగ్ బకాయిలను సైతం చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసి కార్మికులకు ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ సంస్థలో 16 వేల మంది రిటైరయ్యారని.. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరిని తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.


మరోవైపు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ.. తమ సమ్మెపై ఇప్పటికే లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ఆర్టీసీపై మీ వైఖరి చెప్పాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను వారు డిమాండ్ చేశారు. చిత్తశుద్ది ఉంటే మిగిలిన కార్మిక సంఘాలు కలిసి రావాలన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులను నడపొద్దని పేర్కొన్నారు.


ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 7వ తేదీ నుంచి సమ్మె జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసి ఉద్యోగులకిచ్చిన హామీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చి ఈ సమ్మెను నివారించే ప్రయత్నం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ సంస్థలో పారిశ్రామిక అశాంతి కలగకుండా చూడాలని జేఏసీ కోరుతోందన్నారు.

ఇవి కూడా చదవండి

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 09:21 PM