Share News

Cyber Crimes: ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు.. 15 మందిని అరెస్ట్

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:45 PM

ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. మొత్తంగా ఇక, మరో 18 మంది సైబర్ నేరాలు, 13 మంది ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ కేసుల్లో అరెస్ట్ అయ్యారని..

Cyber Crimes: ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు.. 15 మందిని అరెస్ట్
Cyber Crimes

హైదరాబాద్, ఆగష్టు 2 : 2025 సంవత్సరంలో 228 మంది సైబర్ నేర నిందితులను అరెస్టు చేసింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సదరు నిందితులపై దేశవ్యాప్తంగా 1,313 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 1,089 కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు 92 కోట్ల మేర ఈ నిందితులు మోసాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైందని పేర్కొంది. 66 మంది ఫేక్ కాల్ సెంటర్ నేరాలలో అరెస్టు కాగా, 77 మంది ఇన్వెస్ట్మెంట్, జాబ్ ఫ్రాడ్ కేసులో అరెస్టయ్యారని తెలిపింది.


ఇక, మరో 18 మంది సైబర్ నేరాలు, 13 మంది ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ కేసుల్లో అరెస్ట్ అయ్యారని తెలిపింది. నిందితుల్లో ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బ్యాంక్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. ఫేక్ కాల్ సెంటర్ కేసులో గుజరాత్ లో 63 మందిని అరెస్టు చేశారని బ్యూరో వెల్లడించింది.

కొన్ని ముఠాలు అమెరికా పౌరులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టుగా బ్యూరో తెలిపింది. సూరత్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక ముఠాకు చెందిన 20 మందిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్లో లైంగిక వేధింపుల కేసుల్లో 15 మందిని ఈ ఏడాది అరెస్ట్ చేసినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వివరాలు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

చార్జింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే..

చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత వివరాల గోప్యతపై గ్యారెంటీ లేదు.. శామ్‌ఆల్ట్‌మన్ స్పష్టీకరణ

Read Latest and Technology News

Updated Date - Aug 03 , 2025 | 05:47 PM