Delhi Tour: ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jun 18 , 2025 | 10:58 AM
Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం రాత్రి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. గురువారం ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం రాత్రి ఢిల్లీ పర్యటనకు (Delhi Visit) వెళ్లనున్నారు. గురువారం ఢిల్లీలో ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ (Former Prime Minister of England Tony Blair)తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కీలక భేటీలో పాల్గొంటారని సమాచారం. అలాగే ఏఐసీసీ (AICC) పెద్దలను కలిసి పెండింగ్ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలియవచ్చింది. అలాగే పార్టీ అధిష్టానాన్ని, పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు.
ఎన్‌జీవోను నడిపిస్తున్న టోనీబ్లెయిర్..
టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) అనే ఎన్‌జీవోను నడిపిస్తున్నారు. ఇది అనేక దేశాల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన భేటీలో టోనీబ్లెయిర్‌తో పలు విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా టోనీబ్లెయిర్‌తో సమావేశమవుతారని తెలియవచ్చింది.
చాలా సార్లు ఢిల్లీ పర్యటనకు..
రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏడాదిన్నరలో చాలా సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళివచ్చారు. వివిధ సందర్భాల్లో అధిష్టానం పెద్దల్ని కలిసి మంతనాలు జరిపారు. కాగా ఈ మధ్య తాజాగా ఢిల్లీ వెళ్ళి వచ్చాక రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆయనను దగ్గరగా గమనిస్తున్నారు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొత్త బలం వచ్చినట్టుందని, కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరిగాయని చెప్పుకుంటున్నారు. గడిచిన 18 నెలలుగా.. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఎవరేం చేసినా.. ఏం మాట్లాడినా చూసీ చూడనట్టే సీఎం ఉన్నారు. కేబినెట్ మంత్రుల మీద రకరకాల ఆరోపణలు వచ్చినా.. అంత సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడంలేదు. కానీ, ఇప్పుడు ఆయన వైఖరి చూస్తుంటే.. అదంతా గతం. ఇక మీదట అలాంటివేవీ నడవవ్ అన్నట్టుగా ఉందని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర.. యోగాసనాలు వేసిన అనిత
మొబైల్, లాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్
For More AP News and Telugu News