Revanth - Jana Reddy Meeting: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణమిదే
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:26 AM
Revanth - Jana Reddy Meeting: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శాంతి చర్చలు, కాల్పుల విరమణకు సంబంధించి జానా రెడ్డికి మంచి అనుభవం ఉంది.

హైదరాబాద్, ఏప్రిల్ 28: శాంతి చర్చల దిశగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈరోజు (సోమవారం) ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి (Congress Leader Jana Reddy) ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించనున్నారు. నిన్న (ఆదివారం) సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి .. జానా రెడ్డి ఇంటికి వెళ్లారు. శాంతి చర్చలపై సీఎం రేవంత్, జానారెడ్డి, కేకే, వేం నరేందర్ రెడ్డి చర్చిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో సీఎం ఫోన్లో మాట్లాడారు. గతంలో శాంతి చర్చల సమయంలో ఉమ్మడి ఏపీ పార్టీ ఇంచార్జీగా దిగ్విజయ్ సింగ్ ఉన్న విషయం తెలిసిందే.
శాంతి చర్చలు, కాల్పుల విరమణకు సంబంధించి జానా రెడ్డికి మంచి అనుభవం ఉంది. గతంలో చర్చలు జరిగిన సమయంలో జానా రెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. చర్చల్లో జానారెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత సలహాలు, సూచనలు తీసుకుంటామని శాంతి చర్చల కమిటీకి సీఎం తెలిపారు. ఇందులో భాగంగానే జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆపరేషన్ కగార్‌పై సీఎం ఇంత త్వరగా స్పందించడంపై శాంతి చర్చల ప్రతినిధులు స్వాగతిస్తున్నారు.
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
అలాగే నిన్న(ఆదివారం) బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కూడా ఈ అంశాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) కూడా స్పందించారు. శాంతి చర్చలు జరగాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారని, శాంతి చర్చలు జరపాలని.. అంతేకాకుండా కాల్పుల విరమణను నిలిపివేయాలన్నారు. ఈ అంశానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ప్రకటించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టుల సమస్యను శాంతిభద్రతల అంశంగా పరిగణించడం లేదని, ఇదొక సామాజిక అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులు డిమాండ్ చేస్తున్న శాంతి చర్చలు, కాల్పుల విరమణపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లైతే మిగిన రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా దీని ప్రభావం పడనుంది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరితగితిన స్పందిస్తే శాంతి చర్చల అంశం తెరమీదకు రానుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Shubman Gill On Dating Rumours: డేటింగ్ వదంతులపై ఎట్టకేలకు స్పందించిన శుభమన్ గిల్
China: యూనివర్సిటీ డిగ్రీ ఉన్నా వీధిలో ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం.. ఎందుకని అడిగితే..
Read Latest Telangana News And Telugu News