Share News

Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:37 PM

ప్రమాణస్వీకారోత్సవం జరిగే రాజ్‌భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ తదితర ఏర్పాట్లును అధికారులు పరిశీలిస్తున్నారు.

Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
Telangana Cabinet Expansion

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 12:15 గంటలకు కొత్త మంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు రాజ్‌భవన్‌లో కేబినెట్ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Congress Leader Azharuddin) ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రమాణస్వీకారోత్సవం జరిగే రాజ్‌భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.


కాగా.. 22 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత మరో ముగ్గురికి మంత్రులుగా అవకాశం ఇవ్వడంతో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇక మిగిలిన మూడు మంత్రి పదువులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈ మూడు మంత్రి పదవుల్లో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావించింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మంత్రివర్గంలో మరో రెండు ఖాళీలకు అధిష్టానం ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తుందో చూడాలి మరి. కాగా.. మైనారిటీని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉందని.. అందులో భాగంగానే అజారుద్దీన్ కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే

కేంద్ర సహకారంతో రైతులను ఆదుకుంటాం: మంత్రి పొన్నం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 30 , 2025 | 05:06 PM