Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నాం: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:38 PM
తెలంగాణకు భవిష్యత్ విద్యుత్ అవసరాలు, వాటి ప్రణాళికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ హైదరాబాద్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి మెరుగుదల గురించి..
హైదరాబాద్, నవంబర్ 29: గ్రీన్ ఎనర్జీ.. దేశ, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి చాలా అవసరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ఎందుకు? అనే చర్చ జరుగుతుందని.. పారిస్ లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం తప్పకుండా గ్రీన్ ఎనర్జీ ఉండాలని అగ్రిమెంట్ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంలో గుర్తు చేశారు.
తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ప్రణాళికలు సిద్ధం చేశామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్‌తో తెలంగాణ ముందుకు పోతుందని భట్టి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చి దిద్దుతున్నామని, హైదరాబాద్ గ్లోబల్ హబ్ కాబోతోందని భట్టి తెలిపారు.
రాష్ట్ర GSDP పెరగాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగా విద్యుత్‌లో 30 శాతం గ్రోత్ అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. '2014 నుండి 2018 వరకు 14.2 శాతం గ్రోత్ ఉంది. 2020-21లో 5.44 శాతం ఉంది. 2024-25 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 శాతం గ్రోత్ వచ్చింది' అని భట్టి లెక్కలు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News