Telangana 10th Results: 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Apr 29 , 2025 | 07:17 PM
Telangana 10th Results: పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు అంటే బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 1.00 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. రవీంద్రభారతీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం.. మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.
ఇకపై మార్కుల మెమోలు ఇలా..
ఇంత వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ..ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కుతోపాటు మొత్తం మార్కులు,గ్రేడ్‌ను పొందుపరచనున్నారు.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News