10th Results: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:57 PM
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంత వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ..ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు (10th class results) బుధవారం మధ్యాహ్నం 2.15 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. రవీంద్రభారతి (Ravindra Bharathi)లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను ఆయన రిలీజ్ చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 92.78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో 96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. గత ఏడాదితో పోలిస్తే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు అయ్యింది. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత పొందారు. ఈ సారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికల కంటే బాలురు 2.94 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే రెండు పాఠశాలలు మాత్రం సున్నా శాతం ఫలితాలు పొందాయి. టెన్త్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా 99.29 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం.. మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల చేశారు.
వెబ్‌సైట్లు ఇవే...
https://results.bse.telangana.gov.in
ఈ వెబ్‌సైట్లలో టెన్త్ స్టూడెంట్స్ తమ రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
Also Read: PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..
ఇకపై మార్కుల మెమోలు ఇలా..
ఇంత వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ..ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కుతోపాటు మొత్తం మార్కులు, గ్రేడ్‌ను పొందుపరచనున్నారు. అలాగే, 20 ఇంటర్నల్ మార్కులకూ ఇంతవరకూ గ్రేడింగ్ విధానమే ఉండగా.. దీని స్థానంలో మార్కులు ప్రకటించనున్నారు. కొత్త మెమో నమూనాను పాఠశాల విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇస్తామని అందులో అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థి ఫలితాలను పాస్, ఫెయిల్ అని స్పష్టంగా పేర్కొననున్నారు. అయితే, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యా సంఘాలు ఎవరితోనూ సంప్రదించకుండా విద్యా శాఖ ఏకపక్షంగా, అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహాచలం ఘటనపై కేటీఆర్ స్పందన..
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..
For More AP News and Telugu News