Share News

Police Warn: అలా చేస్తే ఎంతటి వారినైనా వదలం.. పోలీస్ శాఖ హెచ్చరిక

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:50 PM

Police Warn: చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో సింగర్‌ మంగ్లీ బర్తే పార్టీ వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం కలకలం రేపింది. దీనిపై సీరియస్‌ అయిన పోలీసులు.. ట్విట్టర్ వేదికగా మంగ్లీకి కౌంటర్ ఇచ్చారు.

Police Warn: అలా చేస్తే ఎంతటి వారినైనా వదలం.. పోలీస్ శాఖ హెచ్చరిక
Telangana Police Warn

హైదరాబాద్, జూన్ 11: చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రిసార్ట్‌లో ఫోక్ సింగర్ మంగ్లీ (Singer Mangli) బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటక కూడా పెద్దఎత్తున డీజే శబ్దాలు రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రిసార్ట్‌‌పై ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో పార్టీలో పెద్దఎత్తున విదేశీ లిక్కర్ పట్టుబడింది. అంతేకాకుండా గంజాయి సేవిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. మంగ్లీ తీరుపై సీరియస్ అయిన పోలీసులు ట్వీట్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారిపై అయినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.


పోలీసుల ట్వీట్

‘అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్‌పై చేవెళ్ల పోలీసులు దాడి చేశారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుంది. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం’ అంటూ తెలంగాణ పోలీసు శాఖ ట్వీట్ చేసింది.


కాగా.. సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం రేపింది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో నిన్న (మంగళవారం) రాత్రి సింగర్ మంగ్లీ పుట్టిన రోజు పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్, జబర్దస్త్ రవి, సింగర్ ఇంద్రావతి హాజరయ్యారు. అయితే ఎంతో ఉల్లాసంగా జరుగుతున్న బర్త్‌వేడుకల్లో పోలీసులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. రిసార్ట్‌ నుంచి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో చేవెళ్ల పోలీసులు రిసార్ట్‌పై దాడి చేశారు. త్రిపుర రిసార్ట్‌లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్‌తో మంగ్లీ పార్టీ నిర్వహించింది. పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్‌కు మంగ్లీ లిక్కర్ సరఫరా చేయించింది. పార్టీ కోసం పెద్దఎత్తున విదేశీ లిక్కర్‌ను తెప్పించారు. పార్టీకి అటెండ్ అయిన ఓ వ్యక్తికి గంజాయి పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.


రైడ్ చేసే సమయంలో రిసార్ట్‌లో మంగ్లీకి సంబంధించిన 50మంది సన్నిహితులు ఉన్నారు. మొత్తం 48 మందికి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. టెస్ట్ సమయంలో పార్టీలో పాల్గొన్నవారు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. డ్రగ్ పరీక్షల సమయంలో పోలీసులతో మంగ్లీ స్నేహితురాలు దివి ర్యాష్‌గా బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సోదాలు జరపడానికి వచ్చిన పోలీసులపై సింగర్ మంగ్లీ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పార్టీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా సరే.. సింగర్ మంగ్లీ వారిపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బర్త్‌డే రోజే మంగ్లీపై చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.


ఇవి కూడా చదవండి

కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్‌ ఓపెన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. చామల సూటి ప్రశ్న

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 04:42 PM