Share News

Crime News: హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం..

ABN , Publish Date - Apr 22 , 2025 | 10:30 AM

ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ అనే వ్యక్తి మియాపూర్‌లో కాపురం పెట్టి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా భార్య, భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి భార్య, అత్తపై మహేష్ కత్తితో దాడి చేశాడు.

Crime News: హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం..
Crime News

హైదరాబాద్: మియాపూర్‌ (Miyapur)లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య, అత్త (wife and mother-in-law)పై అల్లుడు మహేష్ (Mahaesh) కత్తి (Knife)తో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయాల పాలైన ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్‌‌లో ఈ ఘటన జరిగింది. శ్రీదేవిని మహేష్ ప్రేమ వివాహం చేసుకొని క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా దంపతులిద్దరూ తరచుగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలోొ సోమవారం రాత్రి భార్య శ్రీదేవితో పాటు అత్తపై మహెష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీదేవి తల్లి మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read..: లిక్కర్ డాన్‌ను విచారిస్తున్న సిట్ అధికారులు..


మరోవైపు ములుగు జిల్లా, వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ మిస్సింగ్ విషాదాంతమైంది. ఈ కేసును హనుమకొండ పోలీసులు చేధించారు. చిడెం సాయి ప్రకాష్ సుపారీ గ్యాంగ్ చేతిలో హతమయ్యారు. ఈ హత్యకు శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ కారణంగా తెలుస్తోంది. సాయిప్రకాష్ పిన్నితో కానిస్టేబుల్‌కు ఉన్న వివాహేతర సంబంధమే కారణం. గతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు సాయి ప్రకాష్ పిన్నితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న సాయిప్రకాష్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. దీంతో కానిస్టేబుల్ సాయి ప్రకాష్‌పై కక్ష పెంచుకుని పథకం ప్రకారం ప్లాన్ చేసి సపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు సమాచారం. మరికాసేపట్లో పోలీసులు మీడియా సమావేశాలో అన్ని విషయాలు వెల్లడించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ

సినీ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

For More AP News and Telugu News

Updated Date - Apr 22 , 2025 | 10:30 AM